Header Banner

మోహినీ అలంకరణలో భక్తులకు దర్శనం! చిన వెంకన్నకు టీటీడీ పట్టు వస్త్రాలు..

  Sun May 11, 2025 14:49        Politics

ఏలూరు జిల్లా, ద్వారకాతిరుమల (Dwaraka Tirumala) చిన్న వెంకన్న (Chinna Venkanna) ఆలయంలో వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు (Brahmotsavalu) వైభవంగా జరుగుతున్నాయి. ఐదవ రోజు (5th day) ఆదివారం స్వామి వారు మోహిని అలంకరణ (Mohini Alankaram)లో భక్తులకు (Devotees) దర్శనమిస్తున్నారు. ఉదయం సింహ వాహనంపై స్వామి వారి ఊరేగింపు జరగనుంది. అలాగే ఈరోజు రాత్రి 8 గంటలకు స్వామి వారి తిరు కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అనంతరం వెండి గరుడవాహనంపై స్వామివారి ఊరేగింపు జరగనుంది. కాగా చిన్నతిరుమలేశునికి ఆదివారం జరగనున్న దివ్య కల్యాణమహోత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చిన అధికారులు పట్టు వస్త్రాలు అందజేశారు. పట్టువస్త్రాలను శిరస్సుపై ఉంచుకుని ఆలయ ఆవరణలో ప్రదక్షిణలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఏఈవో నటరాజారావుకు అందించారు. స్వామి, అమ్మవార్ల కల్యాణం రోజున తిరుమల దేవస్థానం తరపున అందించాలని కోరారు. కాగా సప్త అశ్వాలను అధిరోహించిన సూర్యభగవానుడిని వాహనంగా చేసుకుని చిన్నతిరుమలేశుడు శుక్రవారం ఉదయం పురవీథుల్లో భక్తులను అనుగ్రహించారు. ఉదయం ఆలయంలో సూర్యప్రభ వాహనంపై ఉభయదేవేరులతో శ్రీవారిని ప్రత్యేక అలంకరణ చేసి హారతులిచ్చారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ గజసేవతో అట్టహాసంగా తిరువీథులకు తీసుకెళ్లారు. రాత్రి చంద్రప్రభ వాహనంపై భక్తులకు కనువిందు చేశారు.

 

ఇది కూడా చదవండి: చిన్న సేవింగ్ పెద్ద లాభం! రోజుకు రూ.166 కడితే చాలు రూ.8 లక్షలు మీ ఖాతాలోకి.. ఈ స్కీమ్‌ గురించి మీకు తెలుసా?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

విడదల రజిని ఓవరాక్షన్.. ఎట్టకేలకు అరెస్టు! మాజీ మంత్రితోపాటు కారులో..

 

ప్రమాదంలో శ్రీశైలం ప్రాజెక్టు.. స్పిల్‌ వే వద్ద భారీ గొయ్యి - జారిపోతున్న కొండ గట్లు!

 

వీరజవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలకు ఏపీ మంత్రులు! మార్గమంతా ప్రజలు పెద్ద సంఖ్యలో..

 

చంద్రబాబు శుభవార్త.. రైతుల అకౌంట్‌లలో డబ్బులు జమ! ఆ పథకం వారందరికి అసలు వర్తించదు..

 

ఏపీకి మరో కొత్త రైల్వే లైను! ఆ రోట్లోనే.. ! వారికి పండగే పండగ!

 

విద్యార్ధుల కోసం మరో పథకం తెస్తున్న కూటమి ప్రభుత్వం..! అప్పటి నుంచే అమల్లోకి!

 

బెట్టింగ్ మాఫియాకు షాక్! ఇద్దరు బుకీలు అరెస్ట్.. మాజీ కేసులు మళ్లీ రంగంలోకి!

 

పొరపాటున వేరే రైలెక్కిన మహిళ..! ఇంతలోనే ఎంత ఘోరం..!

 

హైదరాబాద్‌ విమానాశ్రయంలో హై అలెర్ట్! డ్రోన్లకు నో పర్మిషన్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #TTD #Tirupati #DharmaReddy #BhumanaKarunakarReddy #TDP #Case